ఎంపీ సంతోష్‌ ఛాలెంజ్‌ని స్వీకరించిన హీరో నితిన్‌..

786
- Advertisement -

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బర్త్ డే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్‌ ఛాలెంజ్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు,సినీ ప్రముఖులు ఈ ఛాలెంజ్‌లో భాగస్వామ్యమవుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్‌ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించారు హీరో నితిన్‌.

కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ చెట్టును నాటిన నితిన్‌ ఈ కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు థ్యాంక్స్‌ చెప్పారు. అంతేగాదు తాను కూడా మరికొంతమందికి ఈ ఛాలెంజ్‌ని ఇస్తానని చెప్పారు నితిన్‌.

nithin twitter

కేటీఆర్ బర్త్ డే సందర్భంగా కీసరగుట్ట రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు ఎంపీ సంతోష్‌. ఈ చాలెంజ్‌ను స్వీకరించాలని ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి, మాజీ ఎంపీ కవిత, విజయ్‌ దేవరకొండ, నితిన్‌లకు విసిరారు.

ఈ చాలెంజ్‌కు ఇప్పటికే స్పందించారు వంశీ పైడిపల్లి. ఈ ఛాలెంజ్‌ను విసిరినందుకు ధన్యవాదాలు, ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో అవసరం అంటూ వంశీ పైడిపల్లి ట్వీట్‌ చేశాడు.

Vamshi paidipalli

- Advertisement -