టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఎనర్జీటాక్ స్టార్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. పక్కా మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈచిత్రం ఈనెల 18న గ్రాండ్ గా రిలీజ్ అయింది. పూరీ సొంత బ్యానర్ అయినటువంటి పూరీ కనెక్ట్స్ లో మూవీని నిర్మించారు. విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
రామ్ ఇంతకుమందు సినిమాలకు రానంత క్రేజ్ ఈసినిమాకు వచ్చింది. గత కొంత కాలంగా ప్లాప్ లతో సతమతమవుతున్న రామ్, పూరీకి సరైన సమయంలో హిట్ పడిందని చెప్పుకోవచ్చు.. ఆరు రోజుల్లో ఈసినిమా 56కోట్ల గ్రాస్ ను వసూలు చేసినట్లు తెలిపారు చిత్రయూనిట్. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు.
భారీగా కలెక్షన్లు రావడంతో సంబరాలు చేసుకుంటున్నారు ఇస్మార్ట్ శంకర్ టీం. ఈసినిమా విడుదలయ్యి వారం రోజులు అవతున్నా ఇంకా కొన్ని థియేటర్లలో హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత మాంచి మసాలా ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రావడంతో దీనిని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. జులై 26న డియర్ కామ్రేడ్ చిత్రం విడుదల కానుండడంతో ఇస్మార్ట్ శంకర్ వసూళ్ళకి కాస్త బ్రేక్ పడుతుందేమోనని అంటున్నారు సినీ విశ్లేషకులు.