- Advertisement -
అక్రమ మైనింగ్ కేసులో ఈడీ ఎదుట గాలి జనార్ధన్ రెడ్డి హాజరయ్యారు. 2007లో అక్రమ మైనింగ్ వ్యవహారంలో గాలి జనార్ధన్ రెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, సబిత ఇంద్రారెడ్డి లపై సీబీఐ అభియోగాలు మోపింది. జూన్ 21 2007 మే 15 2009 మధ్యలో భారీగా మనీలాండరింగ్ పాల్పడినట్లు అభియోగాలను ఈ డి నమోదు చేసింది .
అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ యజమాని గాలి జనార్దన్ రెడ్డి ఆయన భార్య లక్ష్మి అరుణలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఫెమా చట్టాలను ఉల్లంఘించి భారీగా మనీలాండరింగ్ పాల్పడినట్లు అభియోగాలు నమోదు చేసింది. ఈడీ ఎదుట హాజరైన గాలి జనార్థన్ రెడ్డి పై గతంలో 120, 421, 4 11, 471 యాక్ట్ కింద కేసులు నమోదు అయ్యాయి.తొలిసారి గాలి జనార్థన్ రెడ్డి ఈడీ ఎదుట హాజరయ్యారు.
- Advertisement -