‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి తప్పుకున్న జగ్గుభాయ్

321
Jagapathi babu Sarileru nikevaru
- Advertisement -

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈచిత్రానికి సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతుంది. ఇటివలే ప్రారంభం అయిన ఈషూటింగ్ మహేశ్ బాబు పాల్గోన్నాడు. ఈచిత్రంలో మహేశ్ బాబు ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.

ఈమూవీలో మహేశ్ బాబు పాత్ర పేరు అజయ్ కృష్ణ అని చెప్పారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈసినిమాలో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం జగపతిబాబు ఈసినిమా నుంచి తప్పుకున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

జగపతి బాబుకు బదులుగా ఆపాత్రలో ప్రకాశ్ రాజ్ నటించనున్నాడని సమాచారం. షూటింగ్ లో పాల్గొనేందుకు కాశ్మీర్ కు వెళ్లిన జగపతి బాబు అక్కడ జరిగిన కొన్ని విభేదాల వల్ల ఈసినిమా నుంచి తప్పుకున్నాడని తెలుస్తుంది. ఆయన పాత్రలో ప్రకాశ్ రాజ్ ను తీసుకున్నట్లుగా ఫిలీం నగర్ లో చర్చ నడుస్తుంది. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

- Advertisement -