హరితహారం అవగాహన సదస్సులో హరీష్‌ రావు..

397
MLA Harish Rao
- Advertisement -

సిద్దిపేట నాగుల బండ వద్ద గల అర్భన్ పార్క్‌లో సిద్దిపేట నియోజకవర్గ హరితహారంపై ప్రజాప్రతినిధులకు, అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీష్ రావు హాజరైయ్యారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్‌ రావు తోపాటు జడ్పి చైర్ పర్సన్ రోజా శర్మ, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. హరితహారం అంటే ప్రహసనంగా సాగద్దు.. రాసి కంటే వాసి ముఖ్యం.ఇప్పుడు పెట్టిన మొక్కలు ఐదేండ్లకు వృక్షాలుగా మారి మన కళ్ళముందు ఉంటే అంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది.నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సర్పంచ్, ఎంపిటిసిలు సమష్టిగా రెండు వేల మొక్కలు నాటాలి.గ్రామాల్లోని రోడ్లకు ఇరువైపులా, స్మశానవాటికలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ ప్రాంతాల్లో మొక్కలు నాటాలి.గ్రామాల్లో ముఖ్యంగా గౌడ్స్, గోళ్లకుర్మలు, ముదిరాజ్ లకే ఎక్కువ భూములు ఉంటాయి.కష్టపడే వారి వద్దనే భూములు ఉండడం సంతోషకారం.

MLA Harish Rao

ప్రతి ఉరికి వంద రైతులను ఎంపిక చేసి వారి పొలాల గట్లపై వారికి నచ్చిన మొక్కలు పెట్టుకునేలా ప్రోత్సహించాలి.వీరిలో 25 మంది గౌడ్స్, 25 మంది ముదిరాజ్, 25 మంది గొల్ల కూర్మలతో పాటు మరో 25 మందిని ఇతరులను ఎంపిక చేయాలి. ఒక్కొక్క మొక్క వెనుక చాలా కష్టం, శ్రమ, డబ్బు ఉంటది.. మొక్కల పెంపకాన్ని సీరియస్‌గా తీసుకోవాలి.రైతులకు లాభం కలిగే మొక్కలే ఇద్దాం.. ఆ మొక్కలతో వారికి లాభం ఉంటుందనిపిస్తే కష్టపడతారు.ఇంటింటికి పండ్ల మొక్కలు ఇద్దాం. పనిని గౌరవించాలి.. పని చేసే అధికారులను, ప్రజాప్రతినిధులను అబినందించాలి. అడవుల యొక్క ప్రాధాన్యత ఈ తరం పిల్లలకు తెలపాలని హరీష్‌ రావు అన్నారు.

ఈ సదస్సులో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ..హరితహారం కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోంది.హరితహారంలో నెంబర్ వన్‌గా ఉన్న జిల్లాను మరో స్టేజ్‌కి తీసుకెళ్లి మారె జిల్లా మనకు దరిదాపుల్లో లేకుండా పని చేయాలి.జిల్లాలో అవెన్యూ ప్లాంటేషన్ అద్భుత ఫలితాలను ఇచ్చింది. జిల్లాలో అన్ని గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ప్రతి గ్రామం నుంచి వంద మంది రైతులను ఎంపిక చేసి వారి పొలాల గట్లపై వారు కోరిన మొక్కలు అందించి నాటెలా ప్రయోగాత్మకంగా అమలు చేద్దాం.

- Advertisement -