‘ఇస్మార్ట్ శంకర్’.. మాస్ డైలాగ్స్‌తో మళ్లో ట్రైలర్‌..

222

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్‌`. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 18న సినిమా విడుద‌ల కానుంది.

iSmart Shankar Movie Trailer 2

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇటు నిధి అగర్వాల్.. అటు నభా నటేశ్ కాంబినేషన్లోని రామ్ రొమాంటిక్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. రామ్ మేనరిజాన్ని.. తెలంగాణ యాసలో ఆయన డైలాగ్ డెలివరీని ఈ ట్రైలర్లో ఆవిష్కరించారు.

రామ్-పూరీలు మాస్ ఆడియన్స్ ను అలరించాలనే ఉద్దేశంతో, వాళ్లను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా చేశారు.ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి.మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సారథ్యంలో విడుద‌లైన నాలుగు పాట‌ల‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. రాజ్ తోట ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు.

#iSmartShankar Trailer 2 [4K Ultra HD] | Ram Pothineni,Nidhhi Agerwal,Nabha Natesh | Puri Jagannadh