1698 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

211
TS Govt

తెలంగాన రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణా వెనకబడిన తరగతుల గురుకుల విద్యా సంస్థల్లో 1698 ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. తెలంగాణా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ద్వారా ఈ నియామకాలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

భర్తీ చేయనున్న పోస్టులు..

ప్రిన్సిపల్స్ -36
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్-1071
పీఈటీ-119
లైబ్రేరియన్-119
క్రాఫ్ట్/ఆర్ట్/మ్యూజిక్ ఇన్స్ ట్రక్టర్-119
స్టాఫ్ నర్స్-119
జూ. అసిస్టెంట్/టైపిస్ట్-110
జూ. అసిస్టెంట్- 5 పోస్టులు