22న అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

495
- Advertisement -

నవంబరు 26 నుండి డిశెంబరు 4వ తేదీ వరకు జరుగనున్న తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నవంబరు 22వ తేది మంగళవారం నాడు ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చాన, శుధ్ధి నిర్వహించనున్నారు.

ఆనంతరం ఉదయం 6.00 నుండి 9.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.

బ్రహ్మోత్సవాల కారణంగా నవంబరు 22న, నవంబరు 25 నుంచి డిసెంబరు 4వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలను తితిదే రద్దు చేసింది.

బ్రహ్మోత్సవాల వాహనసేవల వివరాలు

తేదీ                                    ఉదయం                               రాత్రి

26-11-2016(శనివారం) ధ్వజారోహణం                           చిన్నశేషవాహనం

27-11-2016(ఆదివారం) పెద్దశేషవాహనం                       హంసవాహనం

28-11-2016(సోమవారం) ముత్యపుపందిరి వాహనం       సింహవాహనం

29-11-2016(మంగళవారం) కల్పవృక్ష వాహనం               హనుమంతవాహనం

30-11-2016(బుధవారం)    పల్లకీ ఉత్సవం, వసంతోత్సవం                  గజవాహనం

01-12-2016(గురువారం) సర్వభూపాలవాహనం         స్వర్ణరథం, గరుడవాహనం

02-12-2016(శుక్రవారం) సూర్యప్రభ వాహనం             చంద్రప్రభ వాహనం

03-12-2016(శనివారం) రథోత్సవం                             అశ్వ వాహనం

04-12-2016(ఆదివారం) పల్లకీ ఉత్సవం,

పంచమీతీర్థం   ధ్వజావరోహణ

- Advertisement -