యూట్యూబ్‌లో అల్లు అర్జున్‌ రికార్డ్‌..

219
- Advertisement -

టాలీవుడ్‌ స్టైలిష్ స్టార్, మెగా హీరో అల్లు అర్జున్.. రేసు గుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు వంటి భారీ విజయాలను న‌మోదు చేశాడు. త‌న దైన శైలితో, న‌ట‌న‌తో సినీ ఇండ‌స్ట్రీలో రాకెట్‌లా దూసుకుపోతున్నాడు.మరోవైపు సౌత్ ఇండియాలో అతడి ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాధమ్’ చిత్రం, లింగుస్వామి దర్శకత్వంలో ద్విభాష‌ చిత్రంతో కమిట్ అయ్యాడు బన్నీ.

Cinema-chupista-mama-song-Record-Views-in-youtube-1479655495-1718

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసు గుర్రం సినిమాలో ‘సినిమా చూపిస్త మావ’ పాటకు ఎంత పాపులారిటీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటకు యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న తెలుగు పాటగా రికార్డు నెలకొల్పింది. యూట్యూబ్ లో ఈ పాటను ఏకంగా 19 లక్షల మంది చూశారు. వరికుప్పల యాదగిరి రాసిన పాటకు.. తమన్ ట్యూన్ తోడవడంతో ఈ పాట సూపర్‌ హిట్టయింది. జానీ మాస్టర్ అదిరిపోయే స్టెప్స్ కంపోజ్ చేశాడు. బన్నీ ఎనర్జీ.. శ్రుతి హాసన్ గ్లామర్ కూడా ఈ పాటకు ప్లస్సయ్యాయి. సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఈ పాటను గత ఏడాది మేలో యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ పాట 2 మిలియన్ వ్యూస్ మార్కును అందుకోబోతోంది.

- Advertisement -