చైతూ కోసం సిక్రెట్ టాటూ ను బయటపెట్టిన సమంత

322
Samantha Tatto
- Advertisement -

అక్కినేని సమంత పెళ్లి తర్వాత కూడా వరుస విజయాలతో దూసుకుపోతుంది. నాగ చైతన్యతో కలిసి ఆమె నటించిన మజిలీ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె నటించిన సినిమా ఓ బేబీ. ఈచిత్రం కూడా భారీ విజయాన్ని అందుకుంది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈసినిమా భారీ కలెక్షన్లను రాబడుతోంది.

సినిమా ఘన విజయం సాధించడంతో నిన్న హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు చిత్రయూనిట్. ఫోటో షూట్ లో భాగంగా సమంత తన సీక్రెట్ టాటూ బయటపడే విధంగా ఫోజు ఇచ్చింది. సమంత సీక్రెట్ గా దాచిపెట్టిన ఆ టాటూ మరెంటో కాదు.. తన భర్త నాగ చైతన్య పేరు. ఈ విషయాన్ని సమంతే సోషల్ మీడియాలో తెలిపింది.

కెరీర్‌లో బెస్ట్ ఫేజ్‌ను గడుపుతున్నాను… ఇన్నాళ్లు ఎవరికీ కనిపించకుండా దాచిన టాటూను ఫైనల్‌గా చూపించేస్తున్నాను. నా భర్త చైయ్ నా ప్రపంచం’ అంటూ తన భర్త పేరుతో ఉన్న సీక్రెట్ టాటూను రివీల్‌ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -