విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా డా.రాజశేఖర్ – జీవితల రెండవ కుమార్తె శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్గా పరిచయం అవుతున్న చిత్రం ‘దొరసాని’. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోంది. నిజ జీవితానికి దగ్గరగా ఎంతో రియలిస్టిక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ‘ జూలై 12 న విడుదలకు సిద్ధం అవుతోంది.
చిత్ర విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో ‘దొరసాని’ టీమ్ ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఇందులో భాగంగా ఇటీవల చిత్ర ట్రైలర్ విడుదల కాగా ఇందులోని సన్నివేశాలు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇక తాజాగా చిత్రం నుండి కప్పతల్లి.. కప్పతల్లి అంటూ సాగే పాటని విడుదల చేశారు. ఇందులోని లిరిక్స్ మన హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. గోరెటి వెంకన్న ఈ పాటకి లిరిక్స్ అందించగా, అనురాగ్ కులకర్ణి ఈ పాటని ఆలపించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సమకూరుస్తున్నారు. సన్ని కూరపాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రాజుగా ఆనంద్ , దొరసానిగా శివాత్మిక ఎంతో మెచ్యూర్డ్‌గా నటించారు.