బంగ్లాపై విజయం…సెమీస్ కు టీంఇండియా

334
India Won
- Advertisement -

వరల్డ్ కప్ లో భాగంగా నిన్న బంగ్లాదేశ్ తో తలపడింది ఇండియా. ఈమ్యాచ్ లో బంగ్లాపై 28పరుగుల తేడాతో విజయం సాధించింది టీంఇండియా. కీలక మ్యాచ్ లో విజయం సాధించి సెమీఫైనల్ లోకి అడుగుపెట్టిండి కోహ్లి సేన. ఈమ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా నిర్ణిత 50ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 314పరుగులు చేసింది.

ఓపెనర్లు రోహిత్ శర్మ , రాహుల్ లు బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగిపోయాడు. కేఎల్ రాహుల్ 77పరుగులు చేయగా, రిషబ్ పంత్ 48పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బంగ్లా బౌలర్ ముస్తాఫిజర్ 5వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా మొదట్లోనే షాక్ తగలింది. ఓపెనర్ తమీమ్ 22పరుగులకే పెవిలీయన్ కు చేరాడు. ఆ తర్వాత వచ్చిన సౌమ్య సర్కార్ 33పరుగులు చేసి అవుట్ అయ్యాడు. షకీబ్‌ అల్‌ హసన్‌, ముష్ఫికర్‌ రహీమ్‌లు జట్టును ఆదుకున్నారు.

బుమ్రా నాలుగు వికెట్లు తీయగా, హార్ధిక్ పాండ్యా 5, షమీ,భువనేశ్వర్, చాహల్ లు చెరో ఒక వికెట్ తీశారు, చివర్లో బుమ్రా వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి జట్టుకు విజయాన్నందించాడు. ఈ విజయంతో భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే ఘనంగా సెమీస్ లో అడుగుపెట్టింది. ప్రపంచకప్ లో ఇప్పటివరకు 8 మ్యాచ్ లు ఆడిన భారత్ 6 విజయాలు సాధించింది.

- Advertisement -