హీరోయిన్ కాజల్ అగర్వాల్ బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తుంది. తెలుగు,తమిళ సినిమాల్లో బిజీగా ఉన్న కాజల్ తాజాగా హాలీవుడ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. తెలుగు, తమిళ్ లో చిన్న పెద్ద హీరోలతో తేడా లేకుండా అందరితో నటిస్తూ పుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె తెలుగులో శర్వానంద్ తో రణరంగం, తమిళ్ లో కోమలి అనే సినిమాలు చేస్తోంది.
హీరో మంచు విష్ణు ఓ సినిమాను నిర్మించాలనే ప్లాన్ లో ఉన్నాడట. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఒక చిత్రాన్ని నిర్మించాలని కమిట్ అయ్యాడట. అయితే ఈచిత్రానికి హాలీవుడ్ దర్శకుడిని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈమూవీలో ప్రధాన పాత్రలో కాజల్ ను ఎంపిక చేశారని ఫిలిం నగర్ వర్గాల టాక్.
ఇక తెలుగు, తమిళ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాజల్.. ఇప్పుడు హాలీవుడ్ ఎంట్రీతో అక్కడ కూడా తన సత్తా చాటనుంది. తెలుగు, తమిళ్ లో విజయం సాధించిన కాజల్ కు హాలీవుడ్ లో ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి మరి.