విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా రాజశేఖర్ కూతురు శివాత్మిక ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం దొరసాని. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేష్ బాబు నిర్మించగా టీజర్,పోస్టర్‌తో మంచి రెస్పాన్స్ రాబట్టారు. ఓ సాధారణ కూలీ కుటుంబానికి చెందిన అబ్బాయికి .. దొరవారి కుటుంబానికి చెందిన అమ్మాయికి మధ్య సాగే ప్రేమకథగా ఈసినిమాను తెరకెక్కించారు.
తాజాగా విడుదల చేసిన ట్రైలర్ సూపర్బ్. హీరో,హీరోయిన్లు ప్రేమలో పడటం వారి ప్రేమ దొరసాని ఇంట్లో తెలియడం తర్వాత జరిగే పరిణామాలు,బంధువులు,స్నేహితుల మాటలు పట్టించుకోకుండా హీరో చేసే సాహసాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఆనంద్ దేవరకొండ డైలాగ్ డెలివరీ అందరిని ఆకట్టుకుంటోంది. యూత్‌ని బాగా ఆకట్టుకుంటున్న ట్రైలర్‌పై నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. మీరు కూడా ట్రైలర్‌పై ఓ లుక్కేయండి…