ఇంజనీరింగ్ ఫీజు పెంపు..కమిటీదే తుదినిర్ణయం:సుప్రీం

390
supreme court
- Advertisement -

ఫీజుల పెంపు వ్యవహారంలో వాసవి,శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలకు సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలింది. ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేసే అధికారం కాలేజీలకు లేదని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది సర్వోన్నత న్యాయస్థానం. తెలంగాణ ఫీజుల నియంత్రణ కమిటీకే ఫీజుల నిర్ణయ అధికారం ఉంటుందని తేల్చి చెప్పింది.ఈ విషయంలో హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని అభిప్రాయపడింది.అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ వాసవి కళాశాల పేరెంట్స్ అసోసియేషన్, తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

తొలుత వాసవీ కాలేజీ ఫీజును టీఏఎఫ్‌ఆర్‌సీ రూ. 86 వేలుగా ఖరారు చేసింది. ఈ ఫీజు పెంపు సరిపోదని ఆ కళాశాల హైకోర్టుకు వెళ్లగా, పునఃపరిశీలించాలని ఆదేశించిన న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో దానిని 97 వేలకు పెంచారు. అయితే, అది కూడా సరిపోదని ఆ కళాశాల పేర్కొనడంతో హైకోర్టు లక్షా 60 వేలు ఫీజుగా నిర్ణయించింది.

హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, వాసవీ ఇంజనీరింగ్‌ కాలేజీ పేరెంట్స్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్ధానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. కాలేజీలకు అధికారం ఇస్తే ఇష్టారాజ్యంగా పెంచుకునే ప్రమాదం ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది.

- Advertisement -