- Advertisement -
దర్శకురాలు,కృష్ణ సతీమణి విజయ నిర్మల భౌతికకాయానికి ఏపీ సీఎం జగన్ నివాళులర్పించారు. నానక్‌రామ్‌గూడలోని కృష్ణ నివాసానికి చేరుకున్న జగన్.. విజయనిర్మల భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. కృష్ణ, నరేశ్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భార్య మరణంతో కన్నీమున్నీరుగా విలపిస్తున్న కృష్ణను ఓదార్చారు
.తెలుగు సినిమా రంగానికి విజయనిర్మల చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి అంటే తన తల్లి విజయనిర్మలకు ఎంతో అభిమానమని నరేష్ ఈ సందర్భంగా జగన్‌కు తెలిపారు.
విజయనిర్మల భౌతికకాయానికి అంత్యక్రియలు శుక్రవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరులో జరగనున్నాయి.
- Advertisement -