మరోసారి మెగాస్టార్‌తో నయన్‌..

492
Nayanthara
- Advertisement -

హీరోయిన్ నయనతార బంపర్ ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సైరా సినిమా చేసిన నయన్ మరోసారి ఆయనతో నటించే అవకాశం కొట్టేసింది. సైరా తర్వాత చిరు కొరటాల దర్శకత్వంలో సినిమా చేయనుండగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఒక హీరోయిన్‌గా నయన్‌ని ఎంచుకున్నట్లు సమాచారం.

దాదాపు రెండేళ్ల పాటు సైరా సినిమాతోనే బిజీగా ఉన్న చిరంజీవి ఇటీవ‌లె షూటింగ్‌ను పూర్తి చేశాడు. తన పాత్ర డబ్బింగ్‌ సైతం పూర్తిచేశారు. కేవ‌లం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌, గ్రాఫిక్స్ వ‌ర్క్ మాత్ర‌మే మిగిలి ఉంది. దీంతో కొరటాల మూవీపై దృష్టాసిరించారు చిరు.

ప్రస్తుతం స్క్రీప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న కొరటాల శివ ఆగస్ట్ లో ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ను ప్రారంభించాలని భావిస్తున్నాడట. వినోదంతో పాటు సందేశంతో కూడిన కథగా ఈ సినిమా సాగుతుందని చెబుతున్నారు.చిరంజీవి రైతు పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని తెలుస్తొంది.‌. అంతేకాదు ఇందులో చిరంజీవి డ్యూయల్ రోల్‌లో నటించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్న‌ట్టు సమాచారం. వ‌చ్చే ఏడాది వేస‌వికి ఈ సినిమాను విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంద‌ట‌.మరి ఇప్పటి వరకు నాలుగు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కొరటాల ఈ చిత్రంతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

- Advertisement -