ప్రజావేదిక కూల్చివేత..తాడేపల్లిలో మరో భవన నిర్మాణం..?

751
crda prajavedika
- Advertisement -

ఏపీ సీఎం జగన్‌ అన్నంత పనిచేశారు. ఉండవల్లిలోని ప్రజావేదిక భవనం కూల్చివేతను అధికారులు మంగళవారం సాయంత్రం చేపట్టారు. ప్రజావేదిక భవనాన్ని కూల్చివేత నేపథ్యంలో కలెక్టర్ల సదస్సు వంటి అధికారిక సమావేశాల నిర్వహణకు తాడేపల్లిలో ఒక భవనాన్ని నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సీఆర్‌డీఏ వర్గాలు తెలిపాయి.

ప్రజావేదిక కూల్చివేతతో అక్రమకట్టడాల కూల్చివేత ప్రారంభమైనట్లేనని తెలిపారు సీఎం జగన్‌. దీని తర్వాత ఉండవల్లి కరకట్ట రోడ్డును ఆనుకుని ఉన్న అక్రమ నిర్మాణాలనూ తొలగిస్తామని ఎస్పీల సమావేశంలో ప్రకటించారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు ఇదో సంకేతంగా నిలవాలి. జిల్లాల్లోనూ ఇదే తరహాలో అధికారులు వ్యవహరించాలన్నారు.

అర్ధరాత్రి సమయానికి భవనం చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడ,ప్రధాన భవనం పక్కనే నిర్మించిన ప్యాంట్రీ, చిన్న డైనింగ్‌ హాల్‌, మరుగుదొడ్లను తొలగించారు.భవన ప్రవేశ ద్వారంవద్ద మెట్లు, ఎలివేషన్‌ను తొలగించారు. బుధవారం నాటికి భవనం కూల్చివేత పనులు చాలావరకు పూర్తయ్యే అవకాశముంది.

ప్రజావేదిక కూల్చివేత సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మీడియా ప్రతినిధుల్ని లోపలికి అనుమతించకుండా కూల్చివేత ప్రక్రియ కొనసాగించారు అధికారులు.

- Advertisement -