కన్నుగీటుతో ప్రియాను మించిపోయిన ఐఏఎస్‌..!

470
new wink
- Advertisement -

ఒకే ఒక చూపుతో కొద్ది రోజులు కుర్ర‌కారుకు నిద్ర‌లేకుండా చేసింది మ‌ల‌యాళ భామ ప్రియా వారియ‌ర్. ఆ ఒక్క కన్నుగీటు వీడియోతో ఓవ‌ర్ నైట్ సెల‌బ్రెటీ అయిపోయింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్‌లో కూడా వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది ఈ భామ.

తాజాగా ఓ ఐఏఎస్ టాపర్ సైతం కన్నుగీటుతో సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిపోయారు. 2016లో ఐఏఎస్ టాపర్‌గా నిలిచిన టీనా దబీ ఖాన్…ఐఏఎస్ అధికారి అతర్ అమర్-ఉల్ షఫీ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి సందర్భంగా నిండుగా మెహిందీ అలంకరించుకున్న తన చేతులను చూపిస్తూ కన్నుగీటిన టీనా… రెండ్రోజుల క్రితం ఈ వీడియో ఇన్‌స్టాగ్రాంలో పోస్టుచేశారు. పోస్టు చేసిన రెండు రోజులకే 17 లక్షల మంది ఆమె వీడియో వీక్షించారు. నెటిజన్లు టీనాపై ప్రశంసలు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

టీనా ప్రస్తుతం రాజస్థాన్‌లోని బిల్వారాలో సబ్‌డివిజినల్ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తూ ఐఏఎస్ అభ్యర్థులకు స్ఫూర్తి నింపడంతో పాటు తన ఆలోచనలు పంచుకోవడానికి ఓ బ్లాగ్‌ను నడుపుతున్నారు.

- Advertisement -