ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది ఆసీస్. లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 46 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించిన ఆసీస్ సెమీస్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది. ఆసీస్ విధించిన 286 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఏ దశలోనూ గెలుపుకోసం ప్రయత్నం చేయలేదు. తొలి ఓవర్‌లోనే ఇంగ్లండ్ తొలి వికెట్ కొల్పోయి కష్టాల్లో పడింది.
పేస్ బౌలర్లు బెరెన్‌డార్ఫ్ (5/44), స్టార్క్ (4/43) ధాటికి ఇంగ్లాండ్ 44.4 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది. స్టోక్స్ (89; 115 బంతుల్లో 8×4, 2×6) మరోసారి పోరాడినా ఫలితం లేకపోయింది. బట్లర్ 25, బెయిర్ స్టో 27, రషీద్ 25 పరుగులు చేశారు.
కెప్టెన్ ఆరోన్ ఫించ్ (100; 116 బంతుల్లో 11×4, 2×6) సెంచరీ కొట్టడంతో మొదట ఆస్ట్రేలియా 7 వికెట్లకు 285 పరుగులు సాధించింది. వార్నర్ (53; 61 బంతుల్లో 6×4) రాణించాడు. స్మిత్ (38),కేరీ (38 ) మెరవడంతో ఆసీస్ 285 చేయగలిగింది. ఫించ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.