టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నిర్మాత దిల్ రాజు

511
Dil Raju ttd
- Advertisement -

వరుస హిట్ సినిమాలు నిర్మిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నిర్మాత దిల్ రాజు. తాజాగా ఉన్న సమాచారం మేరకు దిల్ రాజు తిరుమల తిరుపతి దేవస్ధానం పాలక మండలి సభ్యుడిగా నియమితులయ్యే అవకాశాలున్నాయి. టీటీడీ బోర్డు చైర్మన్ గా ఏపీ ముఖ్యమంత్రి జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు కూడా పాల్గోన్నారు. కాగా దిల్ రాజు వెంకటేశ్వరస్వామి భక్తుడు. తన బ్యానర్ పేరు కూడా శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ అని పెట్టుకున్నారు. దిల్ రాజును టీటీడీ పాలక మండలి సభ్యుదడిగా నియమించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న దిల్ రాజు కళ నెరవేరిందని చెప్పుకోవాలి.

- Advertisement -