జర్నలిస్ట్‌పై సానియా ఆగ్రహం..!

342
Sania Mirza
- Advertisement -

భారత టెన్నిస్‌ స్టార్, పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ భార్య సానియా మీర్జా ఎక్కడికి వెళ్లినా మీడియా వెంటాడటం, ఆమె అసహనం వ్యక్తం చేయడం చాలా సార్లు జరిగేదే. మాంచెస్టర్‌లో శనివారం భర్త షోయబ్‌ మాలిక్‌తో కలిసి ఆమె బయటకు వెళ్లింది. వారితో పాటు పాక్‌ ఓపెనర్‌ ఇమాముల్‌ హఖ్‌ కూడా ఉన్నాడు.

దీనిని వీడియో తీసిన పాక్‌ జర్నలిస్ట్‌ ఒకరు ‘కీలక మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌ మానేసి షోయబ్‌ మాలిక్‌ షికార్లు’ అని టీవీలో వార్త ప్రసారం చేశాడు. ఈ వార్తను చూసిన పాక్ క్రీడాభిమానుల నుంచి తీవ్ర విమర్శలు రాగా, దాంతో సానియాకు చిర్రెత్తుకొచ్చి ట్విట్టర్‌లో తన ఆగ్రహాన్ని ప్రదర్శించింది.

ట్విట్టర్‌లో తన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ.. తమ ఏకాంతాన్ని గౌరవించకుండా, ఓ బిడ్డ తమతో ఉన్నాడని కూడా చూడకుండా, తమను వీడియో తీశావని సదరు జర్నలిస్ట్‌పై మండిపడింది. అడగకుండా వీడియో తీయడంతో పాటు చెత్త కథనాన్ని జోడించావని ఆగ్రహాన్నివ్యక్తం చేసింది. మ్యాచ్ ఓడిపోతే భోజనం మానేయాలా? అని ప్రశ్నించింది. మూర్ఖుల బృందం తమ వెంట పడిందని సానియా వ్యాఖ్యానించింది.

- Advertisement -