దిల్ రాజు ’96’లో శ‌ర్వానంద్, స‌మంత‌..

263
96 sharwand samantha
- Advertisement -

త‌మిళంలో హిట్ట‌యిన 96సినిమాను తెలుగులోకి రిమేక్ చేయ‌నున్నారు ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు. 96 తెలుగు రైట్స్ ను ఇటివ‌లే దిల్ రాజు కొనుగోలు చేశారు. అయితే ఇన్ని రోజులు ఈ క‌థ ఎవ‌రితో చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడు దిల్ రాజు. మొద‌ట అల్లు అర్జున్ కు ఈ క‌థ చెప్పిన దిల్ రాజు అత‌నికి క‌థ న‌చ్చినా త్రివిక్ర‌మ్ తో మూవీ ఉండ‌టంతో సైలెంగ్ గా ఉన్నాడ‌ట‌. దింతో మ‌రో హీరోను వెతికే ప‌నిలో ఉన్నాడు దిల్ రాజు.

dil raju

తాజాగా యువ హీరో శ‌ర్వానంద్ కు ఈస్టోరీ వినిపించాడు. క‌థ న‌చ్చ‌డంతో శ‌ర్వా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చా డ‌ని టాక్. ఈమూవీతో కొత్త ద‌ర్శ‌కుడు ప‌రిచ‌య‌మ‌వ్వ‌నున్నాడు. శ‌ర్వాకు జోడి స‌మంత న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. త‌మిళంలో మంచి విజ‌యాన్ని సాధించిన ఈచిత్రం తెలుగులో ఏ మేర‌కు విజ‌యం సాధిస్తుందో చూడాలి. త్వ‌ర‌లోనే ఈప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియనున్నాయి.

- Advertisement -