వైర‌ల్ అవుతోన్న ఎన్టీఆర్ న్యూలుక్..

336
ntr new look
- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్ రామోజీ ఫీలిం సిటీలో మొద‌టి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈమూవీ త్వ‌ర‌లోనే సెకండ్ షెడ్యూల్ ను కూడా ప్రారంభించ‌నున్నారు. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ఇద్ద‌రూ ఈమూవీలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. రాజ‌మౌళి బాహుబ‌లి త‌ర్వాత తెర‌కెక్కిస్తోన్న చిత్రం కావ‌డంతో ఈమూవీపై కూడా భారీగా అంచ‌నాలు ఉన్నాయి.

ntr

చిత్రాన్ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రాజ‌మౌళి తెర‌కెక్కిస్తుండ‌గా, మూవీకి సంబంధించిన లుక్స్ బ‌య‌టికి రాకుండా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట‌. ఈసినిమాలో ఎన్టీఆర్ డిఫ‌రెంట్ లుక్ లో క‌నిపించ‌నున్నాడ‌న్న విష‌యం తెలిసిందే. అందుకు త‌గ్గట్టుగా ఎన్టీఆర్ త‌న ట్రైన‌ర్ వద్ద శిక్ష‌ణ కూడా తీసుకుంటున్నాడు. తాజాగా ఎన్టీఆర్ లుక్ కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ఎన్టీఆర్ తన భార్య, ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ఫొటోలు నెట్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈమూవీలో కీర్తి సురేష్‌, ప్రియ‌మ‌ణిలు న‌టించ‌నున్నార‌ని స‌మాచారం.

- Advertisement -