దేశంలో 24 గంటల్లో 9560 కరోనా కేసులు

17
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో దేశంలో 9560 కరోనా కేసులు నమోదుకాగా 41 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,43,98,696కి చేరగా 4,37,83,788 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 87,311 కేసులు యాక్టివ్‌గా ఉండగా ఇప్పటివరకు కరోనాతో 5,27,597 మంది మృతిచెందారు. మొత్తం కేసుల్లో 0.20 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా రికవరీ రేటు 98.62 శాతం, మరణాల రేటు 1.19 శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 2.50 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

- Advertisement -