9,200 పంచాయతీ కార్యదర్శులకు నోటిఫికేషన్..

186
kcr

కొత్తగా 9200 గ్రామపంచాయతీ కార్యదర్శి పోస్టులకు నోటిఫికేషన్ వేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రతి గ్రామానికి ఒక పంచాయతీ కార్యదర్శి ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో అమోదమేద్రవేస్తామని తెలిపిన సీఎం…వారం రోజుల్లో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుందన్నారు.

తెలంగాణలో గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా మారాలన్నారు. పంచాయతీల పరిధిలో హరితహారం కార్యక్రమం అమలుచేయడం, గ్రామాల పరిశుభ్రత, పన్నుల వసూలు, మురికి కాల్వల నిర్మాణం, నిర్వహణ, విద్యుత్ దీపాల నిర్వహణ, అంటువ్యాధులు ప్రబలకుండా చూడటం లాంటి బాధ్యతలు ఉన్నాయని తెలిపారు. గ్రామపంచాయతీ పాలకవర్గంతో కలిసి గ్రామకార్యదర్శి ఈ బాధ్యతలన్నీ నెరవేర్చాల్సి ఉంటుందని అందుకే గ్రామపంచాయతీ కార్యదర్శుల నియామకం చేపట్టాలని నిర్ణయించామన్నారు.

కొత్తగా నియమితులయ్యే 9,200 మంది పంచాయతీ కార్యదర్శులకు మూడేండ్ల వరకు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుందని, ఆ తర్వాత పనితీరు ఆధారంగా వారిని క్రమబద్ధీకరించాలన్నారు. ప్రొబేషన్ సమయంలో నెలకు రూ.15 వేల చొప్పున జీతం ఇవ్వాలని ఆదేశించిన సీఎం…సమర్థంగా విధులు నిర్వహించలేని వారిని క్రమబద్ధీకరించకుండా ఉండేవిధంగా నిబంధనలు రూపొందించాలని  చెప్పారు.