మునుగోడు బైపోల్ పోలింగ్ ప్రారంభం..

154
munugodu
- Advertisement -

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం నియోజకవర్గం వ్యాప్తంగా 119 కేంద్రాల్లో 298 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు

అర్బన్‌ పరిధిలో 35, రూరల్‌ పరిధిలో 263 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 105 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుండగా అక్కడ కౌంటింగ్ జరిగే వరకు పటిష్ట బందోబస్తును ఏర్పాటుచేశారు. ఇప్పటికే ఓటరు స్లిప్పులను పంపిణీ చేయగా అందనివారు ఆన్‌లైన్‌ ద్వారా పొందొచ్చని ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు.

మొత్తం 2.41 లక్షల మంది ఓటర్లుండగా వారిలో 50 మంది సర్వీసు ఓటర్లు, 2576 మంది 80 ఏళ్లు దాటినవారు ఉన్నారు. ఇక పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లు 5,686 ఉండగా 730 మంది మాత్రమే దరఖాస్తు చేసున్నారు. ఓటర్ల నుంచి ఫిర్యాదుల కోసం సి-విజిల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. పోలింగ్‌ కేంద్రం నుంచే గంటకోసారి ఓటింగ్‌ శాతం నమోదు చేయనున్నారు. సాయంత్రం 6 గంటల లోపు క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.

ఇవి కూడా చదవండి..

కొరివితో తలగోక్కున్న బిజెపి

బండికి అధిష్టానం అక్షింతలు..

మునుగోడు బిజెపికి ప్రతిష్టాత్మకమే

- Advertisement -