- Advertisement -
భారత్‌ను ఒవైపు కరోనా మహమ్మారి కభళిస్తుంటే మరోవైపు ఉగ్రవాదులు దేశంలో చొరబడే ప్రయత్నం చేస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లో చొరబాట్లకు ఉగ్రవాదులు ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన భారత భద్రతా బలగాలు కశ్మీర్ లోయలో ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. కశ్మీర్ లోయలో గడిచిన 24 గంటల్లో 9 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సైనికాధికారులు ప్రకటించారు.
దక్షిణ కశ్మీర్‌లోని బాట్‌పురాలో స్థానిక పౌరులను చంపారన్న సమాచారంతో గాలింపుచర్యలు చేపట్టిన భద్రతా బలగాలకు ఉగ్రవాదులు ఎదురుపడి కాల్పులు ప్రారంభించారు. బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎల్‌వోసీలోని కెరాన్ సెక్టార్‌లో సరిహద్దు దాటుతున్న మరో ఐదుగురు ఉగ్రవాదులను బలగాలు కాల్చి చంపాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఓ జవాను అమరుడయ్యాడని తెలిపారు. మరో ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి.
- Advertisement -