గ్రీన్ ఛాలెంజ్ పాల్గొన్న నూతన వధూవరులు..

42
Green Challenge

రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఖమ్మం జిల్లా వైరా మండలం గరికపాడు గ్రామంలో నూతన వధూవరులు అనిల్ కుమార్ మరియు వాణి మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా నూతన దంపతులు మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతంగా ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా మొక్కలు నాటడం అనందంగా ఉంది అన్నారు.

ఖమ్మం జిల్లా నేనున్నా మహిళా మండలి వెల్ఫేర్ సొసైటీ వారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా మొక్కలు నటించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి మరియు ఎంపీ సంతోష్ కుమార్‌కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేనున్నామహిళా మండలి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు మెరుగు మానస, ప్రధాన కార్యదర్శి బొల్లె పోగు త్రివేణి, మేరుగు రత్నరాజు,మాతంగి రాంబాబు,పాముల కన్నాయ,సత్యం పాల్గొన్నారు.