తెలంగాణలో కొత్తగా 891 కరోనా కేసులు..

225
coronavirus
- Advertisement -

తెలంగాణలో రాష్ట్రంలో కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో పెరుగుతోంది.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 891 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కరోనా కారణంగా మరో ఐదుగురు చనిపోయారని తాజాగా రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది.తాజాగా తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,444కి చేరింది.

ఈ ఒక్కరోజే జిహెచ్ఎంసి పరిధిలో719 కరోనా కేసులు నమోదైయ్యాయి. ఇందులో రంగారెడ్డి 86,మేడ్చల్ 55,సంగారెడ్డి 2,కామారెడ్డి 1, కరీంనగర్ 2, ఖమ్మం 4, భద్రాద్రి 6, సిద్దిపేట 1, మహబూబాద్ 1, నల్గొండ 2, గద్వాల1, వరంగల్ రూరల్ 3, వరంగల్అర్బన్ 3, నిజామాబాద్ 1, ఆదిలాబాద్ 1 కేసుల చొప్పున నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా మహమ్మారితో పోరాడుతూ 4361 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 225 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 5858 యాక్టివ్ కేసులున్నాయి. లాక్‌డౌన్ సడలింపుల తరువాత రాష్ట్రంలో భారీ మొత్తంలో కొత్త కేసులు బయటపడుతున్నాయి.

- Advertisement -