రాష్ట్రంలో 24 గంటల్లో 887 కరోనా కేసులు..

20
coronavirus

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు స్వల్పంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 887 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,08,776కు చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 5,551 యాక్టివ్ కేసులుండగా ఇప్పటి వరకు 3,01,564 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఇప్పటివరకు 1,701 మంది మృత్యువాతపడ్డారు.

తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 201, మేడ్చల్‌లో 79, నిర్మల్‌లో 78, రంగారెడ్డిలో 76, జగిత్యాల జిల్లాలో 56 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.