సూపర్‌ స్టార్ రజనీకి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు..

246
Rajinikanth
- Advertisement -

తమిళనాడు ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

రజనీకి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన విషయాన్ని తెలియజేసేందుకు చాలా సంతోషిస్తున్నాను. భారత సినీ రంగంలోని అత్యున్నత నటుల్లో ఒకరైన రజనీకాంత్ గారికి ఈ సంవత్సరం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందించనున్నాం. ఓ నటుడిగా, నిర్మాతగా స్క్రీన్ రైటర్ గా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు నిరుపమానం. రజనీకాంత్ ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు నా ధన్యవాదాలు అని వెల్లడించారు.

- Advertisement -