86 మంది మావోల లొంగుబాటు

3
- Advertisement -

తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లా పోలీసులు మరియు 81 BN & 141 BN CRPF అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కొరకు నిర్వహిస్తున్న “ఆపరేషన్ చేయూత” కార్యక్రమం ద్వారా లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వ కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకొని, హింసాత్మక నక్సలిజం. మార్గాన్ని విడిచిపెట్టి ఇకపై తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకొని 22) (86) ACM-04, Party Members – 05, RPC Committee -08, RPC Militia -27, RPC DAKMS/KMS-20, RPC CNM-13, and RPC GRD -09, 6 మల్టీ జోన్ -1 ముందు లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలిశారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న వలస ఆదీవాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కొరకు తెలంగాణ ప్రభుత్వం మరియు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలు మరియు కార్యక్రమాలకు ఆకర్షితులై, పోలీసుల ఎదుట లొంగిపోవడం వలన కలిగే ప్రయోజనాలు, తద్వారా ప్రభుత్వం కల్పించే పథకాలతో లబ్ది పొందాలని, కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుని, ఈ సంవత్సరంలో ఇప్పటివరకు ఈ రెండు జిల్లాల్లో వివిధ స్థాయిలలో పనిచేసిన 224 మంది మావోయిస్టులు అనగా DVCM-02, ACMs/PPCMs-10, Party Members-25, Militia Members-74, RPC Members-23, DAKMS/KMS Members-41, CNM Members-31, Courier-01 మరియు GRD-17 జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగింది.

గత కొంతకాలంగా నిషేధిత CPI మావోయిస్టు పార్టీ, ఆదివాసీ ప్రజలలో ఆదరణ, నమ్మకం కోల్పోయి కాలం చెల్లిన సిద్ధాంతాలతో పాటుగా, బలవంతపు వసూళ్ళే లక్ష్యంగా పనిచేస్తూ, ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటూ, ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందితే తమకు మనుగడ ఉండదని భావించి అమాయకపు ఆదివాసీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా, అమాయకపు ఆదివాసి ప్రజలు నిత్య జీవనం కోసం సంచరించే ప్రదేశాలలో మందుపాతరలను అమర్చుతూ వారి యొక్క మరణాలకు ప్రత్యక్ష కారకులవుతున్నారు. ఇటీవల కాలంలో వీరి యొక్క దుశ్చర్యల వలన ఊసురు పోలీస్ స్టేషన్ పరిధిలో రాంపూర్ గ్రామానికి చెందిన ఒక ఆదివాసీ మహిళకు కాలు పోగా, సోడిపార గ్రామానికి చెందిన మరొక ఆదివాసీ మహిళ మరణించింది. ఇలాంటి విషయాలు ఎన్నో గ్రహించి, మావోయిస్టు పార్టీ వలన ప్రజలకు ఉపయోగం లేదని, పైన తెలిపిన మావోయిస్టు సభ్యులు పార్టీని వీడి ఈ రోజు పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగింది.

లొంగిపోయి సాదారణ జీవనం గడపాలనుకునే పార్టీ సభ్యులు, వారి కుటుంబ సభ్యుల ద్వారా గాని, స్వయంగా గాని తమ దగ్గరలో గల పోలీస్ స్టేషన్లను లేదా జిల్లా ఉన్నతాధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. లొంగిపోయిన దళ సభ్యులకు జీవనోపాధి, పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం తరుపున అందవలసిన అన్ని రకాల ప్రతి ఫలాలను అందించడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడు కృషి చేస్తుంది.

Also Read:పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన..

తెలంగాణ ప్రాంతానికి చెందిన పెద్ద నాయకులు జనజీవన స్రవంతిలో కలిసినట్లయితే, వారికి ప్రత్యేకమైన నగదు మరియు ఇతర పునరావాస సదుపాయాలు అందించడానికి పోలీస్ శాఖ కృషి చేస్తుంది.

- Advertisement -