8 మంది సిమీ ఉగ్రవాదులు హతం…

254
online news portal
- Advertisement -

గత రాత్రి రెండు గంటల సమయంలో సెంట్రీ రామ్ కుమార్ ను దారుణంగా హత్య చేసి పారిపోయిన ఎనిమిది మంది సిమీ ఉగ్రవాదుల పన్నాగం భోపాల్ పోలీసుల ముందు పారలేదు. ఉగ్రవాదులను ఎలాగైనా పట్టుకోవాలన్న పోలీసుల దృఢ నిశ్చయం భోపాల్ నగరాన్ని, చుట్టు పక్కల ప్రాంతాలనూ దిగ్బంధం చేయగా, ఈ ఎనిమిది మందీ పోలీసుల కళ్లు గప్పి ఎక్కువ దూరం ప్రయాణించలేకపోయారు. తప్పించుకున్న ఆరుగంటల్లోనే ఎనిమిది మంది సిమీ ఉగ్రవాదులు… యాంటీ టెర్రరిస్ట్‌ స్వా్కడ్‌(ఏటీసీ) జరిపిన కాల్పుల్లో హతమయ్యారు.

ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం భోపాల్‌ కేంద్ర కారాగానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా(సిమి)కి చెందిన ఉగ్రవాదులు భోపాల్‌ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి గార్డుగా వ్యవహరిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ను గొంతు కోసి దారుణంగా హతమార్చి పరారయ్యారు. నిందితుల కోసం క్షుణ్ణంగా గాలింపులు చేపడుతుండగా భోపాల్‌ నగర శివారులో వారు తలదాచుకున్నట్లు సమాచారం అందింది. దీంతో ఏటీసీ పోలీసులు వారు దాక్కున్న ప్రాంతానికి వెళ్లి చుట్టుముట్టి ఎన్‌కౌంటర్‌ చేశారు.

bhopal-simi

అయితే,పారిపోయిన తరువాత అందరూ విడిపోకుండా, ఒకే గ్రూప్ గా కలసి ఉండటంతో కేవలం 6 గంటల వ్యవధిలోనే వారు దొరికిపోయారు. భోపాల్ కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న, ఇంత్ కేడీ గ్రామ సమీపంలో వీరిని గుర్తించారు. తమకు లొంగిపోవలసిందిగా పోలీసులు వారిని కోరినప్పటికీ, వారు వినిపించుకోకుండా, పరుగు లంఘించుకోవడంతో కాల్పులు జరపక తప్పలేదని, కాల్పుల్లో వారంతా హతమయ్యారని ఓ పోలీసు అధికారి వివరించారు.

online news portal

- Advertisement -