ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో పసిపాప మాయం..

229
8 Days Old Baby Missing
- Advertisement -

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మాతా శిశు రక్షణ కేంద్రంలో పసికందు అదృశ్యం అయిన ఘటన కలకలం రేపింది. సంతానం కొసం చాలా ఆసుపత్రులు తిరిగాం.. ఎన్నో పూజలు చేశాం.. వెళ్లి దేవుళ్లకు మొక్కుకున్నాం.. పెళ్లయిన పదేళ్లకు మాకు పాప పుట్టింది.. నా బంగారు తల్లిని చూసుకున్న మురిపెం ముణ్నాళ్ల ముచ్చటగా మారింది. నా బిడ్డను ఎవరు ఎత్తుకెళ్లెరో తెచ్చి ఇవ్వండమ్మా.. అంటూ ఆ కన్నతల్లి కన్నీరు పెట్టుకోవడం అక్కడున్న వారిని కంట తడి పెట్టించింది.

8 Days Old Baby Missing

ఈ సంగారెడ్డిలో జరిగింది. పది రోజుల క్రితం పుట్టిన శిశువుకు పచ్చకామెర్లు వచ్చాయని ఆసుపత్రికి తీసుకెళ్తే శిశువునే మాయం చేసిందో ఆయా. సంగారెడ్డిలో కల్పగూర్ గ్రామానికి చెందిన హన్మోజిగారి మాధవి(28) గత నెల 30న జిల్లా ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 3న బిడ్డకు పచ్చకామెర్లు రావడంతో తిరిగి ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు శిశువును ఎస్‌ఎన్‌సీయూలో ఉంచారు. మంగళవారం ఉదయం గుర్తుతెలియని మహిళ ఎస్‌ఎన్‌సీయూలోకి వచ్చింది.

8 Days Old Baby Missing

అక్కడే ఉన్న ఆయా వనిత ఆమెను మాధవిగా భావించి బిడ్డను ఆమెకు అప్పగించింది. ఆ తర్వాత కాసేపటికి బిడ్డను చూసేందుకు వెళ్లిన మాధవికి అక్కడ చిన్నారి కనిపించకపోవడంతో ఆయాను ప్రశ్నించింది. ఆమె నుంచి సరైన సమాధానం రాకపోవడంతో గట్టిగా నిలదీసింది. ఆసుపత్రి మొత్తం గాలించినా బిడ్డ కనిపించకపోవడంతో మాధవి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫర్నిచర్‌ పగలగొట్టారు. ఆసుపత్రిలోని ఆర్‌ఎంఓ ఛాంబర్‌లో సీసీ ఫుటేజీలను పరీక్షించగా బిడ్డను ఓ గుర్తు తెలియని వ్యాక్తి బయటకు తీసుకెళ్తున్నట్టు రికార్డైంది. కుటుంబ సభ్యుల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాప ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -