76 ఏళ్ల భారతం..ప్రగతి పథంలో ఉన్నామా?

33
- Advertisement -

76 ఏళ్ల స్వతంత్ర భారతం..దేశంలో చాలా మందిని ఓ ప్రశ్న అడగండి..అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటీ…చాలా మందికి దాని అర్ధం, విలువ తెలయదు. ఒక వేళ తెలిస్తే అది దేశ అభివృద్ధికి పాటు పడుతుంది. ఇక ముఖ్యంగా మానవులే ఏ దేశానికైన గొప్ప సంపద. మానవ వనరులను అభివృద్ధి చేసుకుని ప్రణాళికలను, బడ్జెట్లను రూపొందించడం అవసరం. అప్పుడే ప్రతి మనిషికి జీవన ప్రమాణాలు ఎలా పెరిగాయో, ఎట్లా పెంచాలో అనే కర్తవ్యాలు ముందుకు వస్తాయి. తద్వారా ఉపాధి, ఉద్యోగ, సంపద సృష్టి సేవారంగాల్లో ఎదగడం సాధ్యమే.

ప్రపంచ వ్యాప్తంగా సంపన్న దేశాల జాబితాలో భారత్‌కు 8వ స్థానం దక్కింది. అయితే 76 ఏళ్ల స్వాతంత్ర దేశంలో గత మూడు దశాబ్దాల్లో సాధించిన ప్రగతి ఎక్కువ. ఒకప్పుడు ఒక ఫోన్ కనెక్షన్ కోసం ఎంపీల చుట్టూ ఎలా లైన్లు కట్టేవారో, గ్యాస్ సిలిండర్ కనెక్షన్ కోసం నెలల తరబడి ఎలా వేచిచూసేవారో కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అది ఏ పార్టీ అయినా సరే ఒక్కరికే క్రెడిట్ ఇవ్వకున్న తమ పరిపాలనతో లేట్ అయినా నెమ్మదిగా వచ్చిన సంస్కరణలతో మార్పు సాధ్యమైంది. ఫలితంగా టెక్నాలజీ వినియోగం పెరగడం, ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడింది. ప్రజల జీవన విధానాల్లో కాస్త మార్పు వచ్చినా ఈ మూడు దశాబ్దాల్లో అసమానతలు విపరీతంగా పెరిగాయి. బిలియనీర్ల సంపద అమాంతంగా పెరిగిపోతూ వచ్చింది. జాతీయ సంపదలో దిగువన ఉన్న వారి సంపద పడిపోతూ వచ్చింది.

90లో ఫోర్బ్స్ అంతర్జాతీయ సంపన్నుల అగ్రజాబితాలో భారతదేశం నుంచి ఒక్క పేరు కూడా లేదు. కానీ భారతదేశంలో ఇవాళ 166 మంది బిలియనీర్లు ఉన్నారు. 2000 సంవత్సరంలో 9 మంది ఉంటే 2017 నాటికి ఆ సంఖ్య 119కి పెరిగింది. 2022నాటికి బిలియనీర్ల సంఖ్య 166కు చేరింది. దేశంలో 77 శాతం జాతీయ సంపద పది మంది శాతం చేతిలో కేంద్రీకృతమై ఉందంటే అభివృద్ధి ఫలాలు ఏ వర్గానికి చేరువయ్యాయో తెలుస్తుంది.

మూడు దశాబ్దాల్లో వచ్చిన సంస్కరణలు దుర్భర దారిద్య్రాన్ని తగ్గించడంలో విపలం కాగా అసమానతలను పెంచడంలో సక్సెస్ అయ్యాయి. ఉద్యోగుల వేతనాల్లో భారీ వ్యత్యాసం ఉంది. చాలీ చాలని జీతం,ఇంక్లూజివ్ గ్రోత్ భారత్‌కు చాలా పెద్ద సవాళ్లు విసురుతున్నాయి. అసంఘటిత కార్మికులు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. అయితే ఓ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అసమానతలు విపరీతంగా ఉన్న దేశాల్లో భారత్ అగ్రజాబితాలో ఉంది.

Also Read:76 ఏళ్ళ భారతం..ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా?

దారిద్ర్యం లాగే అసమానత కూడా సమాజాన్ని పట్టి పీడించే సామాజిక రోగంగా మారింది. ఫలితంగా చాలామంది విశ్లేషకులు సెలెక్టివ్‌గా తమకు కావాల్సిన వివరాలను మాత్రం హైలెట్ చేస్తూ మిగిలిన పార్శ్వాలను చిన్న గీతగా మారుస్తుంటారు. అభివృద్ధికి ప్రధాన ప్రమాణం ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చడం కాదు అని పాలకులు తెలుసుకోవాలి. అయితే పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ద్వయం సంస్కరణలకు పెద్దపీట వేశారు. ఫలితంగా క్రమక్రమంగా దేశంలో మార్పులు రావడం మొదలయ్యాయి. ఫలితంగా ఆహారధాన్యాల కొరతను అధిగమించి ఇవాళ ఎగుమతిదారుగా అవతరించింది. ఆ పరిణామంలో హరిత విప్లవం కీలక పాత్ర పోషించింది.

అయితే దేశంలో ఇప్పటికి అభివృద్ధి ప్రతి పౌరుడికీ సమానంగా అందలేదు. చాలా మంది ప్రజలు మెరుగైన జీవన ప్రమాణాలను అనుభవించటం లేదు. ఉదాహరణకు ఒక ఆకాశ హర్మ్యం లాంటి అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ పక్కనే ఒక మురికివాడ కూడా ఉంటుంది…దేశంలో మహిళల పట్ల ప్రవర్తించే తీరు, నేరాల స్థాయి కూడా కొంత ఆగ్రహానికి గురి చేసే అంశంగా ఉంది. ఒక దేశ అభివృద్ధి ఆ దేశ ప్రజలు అనుభవిస్తున్న హక్కుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈ దిశలో ఇంకా చాలా ముందుకు ప్రయాణించాల్సి ఉంది. మహిళలు పబ్లిక్ స్థలాలలో సురక్షితంగా ఉన్నారనేంత వరకు ఎంత అభివృద్ధి జరిగినా నిరర్ధకం.అయితే స్థూలంగా సంస్కరణలు తెచ్చిన ప్రగతిని, ఆ ప్రగతి తెచ్చిన పురోగతిని మెచ్చుకోవాలి.

Also Read:ప్రపంచం మెచ్చిన…. భారతదేశం

- Advertisement -