76 ఏళ్ళ భారతం..ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా?

36
- Advertisement -

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి సరిగ్గా 76 సంవత్సరాలు అయ్యాయి. 76 సంవత్సరాల్లో మెజార్టీ సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించగా గత 9 ఏళ్ళుగా ప్రధాని మోడీ దేశాన్ని పాలిస్తున్నారు. సుదీర్ఘ కాలం సేవలు అందించిన నాలుగో ప్రధానిగా మోడీ నిలవగా ఎక్కువకాలం పదవిలో ఉన్న తొలి కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డు సృష్టించారు. 2014లో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకతను తమవైపు తీసుకొచ్చేందుకు గుజరాత్ సీఎంగా ఉన్న మోడీని తెరపైకి తీసుకొచ్చింది బీజేపీ. గుజరాత్ మోడల్‌ని విస్తృత ప్రచారం చేయగా మోడీ సునామీ ముందు విపక్షాలన్ని కొట్టుకుపోయాయి. దీంతో 2014 మే 26న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు మోడీ. తర్వాత 2019లో లోక్‌సభ ఎన్నికలతో మరోసారి ప్రజల్లోకి వెళ్లిన మోడీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బ్రహ్మాండమైన మెజార్టీతో రెండోసారి ప్రధాని పదవి చేపట్టారు.

అయితే ఈ 9 ఏళ్ళ పాలనలో మోడీ సంచలన నిర్ణయాలకు కేరాఫ్‌గా మారారు. 2016లో నోట్లను రద్దు, 2017లో GST,జమ్మూకాశ్మీర్‌కి స్వయం ప్రతిపత్తి తొలగింపు,సర్జికల్ స్ట్రైయిక్స్‌తో ఏ నిర్ణయమైనా సంచలనమే. అయితే ఇందులో నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొగా జీఎస్టీ ఇప్పటికి ప్రజలకు అర్ధం కాని బ్రహ్మాపదార్ధంగానే మిగిలిపోయింది. అయితే మోడీ రెండోసారి అధికారంలోకి రావడానికి ప్రధానంగా దోహదపడింది మాత్రం సర్జికల్ స్ట్రైయిక్సే.

Also Read:సబ్జా గింజలు..ఔషధ గుణాలు

ఇక రెండోసారి అధికారంలోకి వచ్చాక దేశంలో మతాలు,కులాల మధ్య చిచ్చు మరింత రాజుకుంది. ఇక ప్రస్తుతం దేశంలో జరుగుతున్న హింస ,ముఖ్యంగా మణిపూర్ వంటి రాష్ట్రాల్లో జరుగుతున్న అల్లర్లపై ప్రధాని మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు ఇప్పటికి ప్రజల కళ్ల ముందే ఉన్నాయి. 2014కు ముందు భారత దేశ అప్పు 55 లక్షల కోట్లు కాగా మోడీ ప్రధాని అయ్యాక ఇది కాస్త డబుల్ అయింది. అది కేవలం 9 సంవత్సరాల్లోనే. ఈ 9 సంవత్సరాల్లో ప్రధానిగా మోడీ చేసిన ఒక్క మంచిని కూడా చెప్పలేని స్థితిలో ఆ పార్టీ శ్రేణులు ఉన్నాయి. కేవలం మతం ప్రాతిపదికనే పాలన సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రజా సంక్షేమం సంగతి పక్కన ఉంచితే మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ పిలుపుతో.. దేశీయ ఉత్పత్తుల కొనుగోళ్లకు ప్రేరణ కల్పించారు. స్టార్టప్‌లకు ఊతమిచ్చారు. స్వచ్ఛభారత్‌తో స్వచ్ఛతకు పిలుపిచ్చారు. డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించారు. ఫలితంగా ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. ఐతే రూపాయి మారకపు విలువ అంతకంతకూ పడిపోతూనే ఉంది.

మోడీ పాలనలో అంతా బాగానే ఉన్నట్లు కనిపించినా ఇంకా చెయ్యాల్సింది చాలా ఉంది. సమగ్ర , ఆరోగ్యం, వ్యవసాయం, నీటి పారుదల, గ్రామాల్లో అభివృద్ధి వంటి అంశాల్లో దేశం వెనకబడే ఉంది. నల్లధనాన్ని విదేశాల నుంచి తెప్పించడం జరగలేదు. రాష్ట్రాల మధ్య చాలా సమస్యలకు కేంద్రం పరిష్కారాలు చూపలేకపోగా పరోక్షంగా కయ్యాలు పెట్టేందుకు కారణమవుతోంది.

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో అక్కడ జరిగిన ఘర్షణల్లో 169 మంది పౌరులు మృత్యువాత పడ్డారు. సీఏఏ నిరసనల్లో 35 మంది, సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన నిరసనలు మత ఘర్షణలుగా మారి పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. రాత్రికిరాత్రి తీసుకొన్న లాక్‌డౌన్‌ నిర్ణయంతో 989కి పైగా వలస కార్మికులు మృత్యువాతపడ్డారు. సాగుచట్టాలను నిరసిస్తూ చేపట్టిన నిరసనల్లో 702 మంది రైతన్నలు మరణించారు.ఏదిఏమైనా మోడీ 9 ఏళ్ళ పాలనలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

Also Read:సమంత ఒడిలో పిల్లలు.. వైరల్!

- Advertisement -