దేశంలో 24 గంటల్లో 7495 కరోనా కేసులు..

88
covid

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 7,495 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా దేశంలో ప్ర‌స్తుతం 78,291 క‌రోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. క‌రోనా రిక‌వ‌రీ రేటు 98.40 శాతానికి పెరుగగా దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 139.70 కోట్ల‌కు పైగా కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 236కు చేరాయి. ఒమిక్రాన్ బాధితుల్లో 104 మంది కోలుకున్నారు. మ‌హారాష్ట్ర‌లో 65, ఢిల్లీలో 64, తెలంగాణ‌లో 24, రాజ‌స్థాన్‌లో 21, క‌ర్ణాట‌క‌లో 19, కేర‌ళ‌లో 15, గుజ‌రాత్‌లో 14 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.