దేశంలో కరోనా పంజా…24 గంటల్లో 459 మంది మృతి

213
corona
- Advertisement -

దేశంలో కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. కరోనా పంజాతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో గత 24 గంటల్లో 72,330 కరోనా పాజిటివ్ నమోదుకాగా 459 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,22,21,665కు చేరింది. కరోనా నుండి 1,14,74,683 మంది కోలుకోగా 1,62,927 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 5,84,055 యాక్టివ్‌ కేసులుండగా టీకా డ్రైవ్‌లో భాగంగా 6,51,17,896 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -