దేశ వ్యాప్తంగా నాలుగో దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 7గంటలకు ప్రారంభైమన ఈపోలింగ్ సాయంత్రం 5గంటలకు ముగియనుంది. పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు ఓటర్లు. నాల్గవ దశ ఎన్నికల్లో మొత్తం 8 రాష్ట్రాల్లోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
మహారాష్ట్రలోని 17, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ల్లో 13 చొప్పున, పశ్చిమబెంగాల్‌లో 8, మధ్యప్రదేశ్, ఒడిశాల్లో 6 చొప్పున, బిహార్‌లో 5, జార్ఖండ్‌లోని 3 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఈఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్‌పెద్దర్ రోడ్‌లోని పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నిల్చుని ఓటు వేశారు.
ప్రముఖ వ్యాపార వేత్త అనిల్ అంబానీ ముంబై కఫ్పే పెరడ్‌లోని జీడీ సోమని స్కూల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకురాలు వసుంధర రాజే సింధియా జల్‌వార్‌లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి, నవాడా సిట్టింగ్ ఎంపీ గిరిరాజ్ సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.