టీ హబ్‌కు ఏడేళ్లు…

632
KTR for T Hub-2 soon
- Advertisement -

ప్ర‌తి సామాన్య పౌరుడి స‌మ‌స్య‌ను తీర్చేందుకు ఇంట‌ర్నెట్‌నే సాధనంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టీహబ్‌ను ముందుకు తీసుకొచ్చింది. ఏడేళ్ల కిందట గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీలో టీ-హబ్  ఏర్పాటు అయ్యింది. నవంబర్ 5న గవర్నర్ నరసింహన్, పారిశ్రామిక దిగ్గజం.. టాటా కంపెనీల అధినేత రతన్ టాటా ప్రారంభించారు. ఐటీ మంత్రి కేటీఆర్ చొరవతో ప్రారంభమైన టీ – హబ్  ఏడేళ్లుగా విజయవంతంగా నడుస్తోంది. దేశంలోనే బెస్ట్ అండ్ లార్జెస్ట్ ఇంక్యుబేటర్ గా గుర్తింపు సొంతం చేసుకుంది టీ – హబ్.

ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ ఇవ్వాలనే లక్ష్యంతో ఫైబ‌ర్ ఆప్టిక్ ద్వారా ప్ర‌తి గ్రామానికి ఇంట‌ర్నెట్ సేవ‌లు అందించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం భావిస్తోంది. టీ-హ‌బ్‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలంగాణ ప్ర‌త్యేక స్థానాన్ని సంత‌రించుకుంది. స్టార్ట్ అప్స్‌కు ఇంక్యూబేట‌ర్‌గా టీ హ‌బ్ అగ్ర స్థానంలో దూసుకెళ్లుతుంది.

KCR will lay the foundation for T-Hub-2 soon

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టీ-హబ్ వందకు వంద శాతం సక్సెస్ అయింది. తొలి ఏడాదిలోనే అద్భుత విజయాలు సాధించింది. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో రూ.40 కోట్లతో 70వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదు అంతస్తుల్లో నిర్మించారు.

KCR will lay the foundation for T-Hub-2 soon

తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో టీ హబ్ ద్వారా యువ ఆంట్రప్రెన్యూర్లను ప్రోత్సహిస్తోంది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇంటర్నేషనల్, ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నల్సార్ యూనివర్సిటీల భాగస్వామ్యంతో టీ-హబ్ పనిచేస్తోంది. యువ ఆంట్రప్రెన్యూర్లకు ఇది పర్ ఫెక్ట్ ప్లాట్ ఫామ్.

T hub

మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో టీ-హబ్  అద్భుతాలు చేసింది. స్టార్టప్‌ లను ప్రోత్సహిస్తూ దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్‌ గా అవతరించింది. టీ-హబ్ గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరగడంతో.. ఐటీ, పారిశ్రామిక దిగ్గజాలు టీ-హబ్‌ ను సందర్శించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా, అరోబా నెట్‌ వర్క్స్ కో-ఫౌండర్ కీర్తి మెల్కొటే టీ-హబ్‌ ను చూసి అబ్బురపడ్డారు. ఇక్కడి వసతులు, సౌకర్యాల గురించి తెలిసి ఆశ్చర్యపోయారు.

KCR will lay the foundation for T-Hub-2 soon

దేశీయ దిగ్గజ కంపెనీలు కూడా టీ హబ్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. స్టార్టప్ ల ఏర్పాటుకు సాయం చేయడానికి నాస్కామ్ టీ-హబ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఉబెర్ ఎక్స్ ఛేంజ్ సంస్థ కూడా టీ హబ్ తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇంకా చాలా సంస్థలు టీ-హబ్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -