టాలీవుడ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ ఎమ్మెస్ రాజు ప్రస్తుతం ‘7 డేస్..6 నైట్స్’ సినిమా తెరకెక్కిస్తున్నారు. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వింటేజ్ పిక్చర్స్, ఏబీజీ క్రియేషన్స్ తో కలిసి సుమంత్ అశ్విన్, ఎస్ రజినీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమంత్ అశ్విన్, మెహర్ చావల్ హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ..డర్టీ హరి సక్సెస్ తర్వాత ఆడియెన్స్ అదే జోనర్ లో మరో సినిమా చేయాలనుకున్నారు. కానీ ఈ చిత్రం పూర్తిగా కొత్త పంథాలో సాగుతుంది. మా బ్యానర్ టాలెంట్ కలిగిన కొత్త నటీనటులను ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తూ బ్రేక్ ఇస్తుంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేశాం. త్వరలోనే నెక్ట్స్ షెడ్యూల్స్ మొదలుపెడతామని చెప్పారు. ఎంఎస్ రాజుగారు సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు.