నిర్మ‌ల్ వ‌ర్ష‌ ప్రభావిత ప్రాంతాలపై సీఎం కేసీఆర్ ఆరా..

35

ఎడ‌తెరిపి లేని వ‌ర్షాల వ‌ల్ల నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని వ‌ర‌ద ప్రాంతాల్లో ప‌రిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీఎం…అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర‌ద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మ‌రో 24 గంట‌ల పాటు అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం చెప్పారు. ఏ ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. సహాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టడానికి నిర్మ‌ల్‌కు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతున్నామ‌న్నారు.