6వ దశ ఎన్నికల పోలింగ్‌..అప్‌డేట్

15
- Advertisement -

6వ దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా ఢిల్లీ, హర్యానా, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్టాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 8 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు 58 లోక్ సభ నియోజకవర్గాల్లో బరి లో 889 మంది అభ్యర్థులు ఉన్నారు.

6వ విడతలో ఒడిశా రాష్ట్రంలో 42 శాసన సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1.14 లక్షల పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేయగా 11.13 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.పోలింగ్ విధుల్లో 11.4 లక్షల మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారు.

58 లోక్ సభ నియోజకవర్గాల్లో జనరల్ 49 మంది, ఎస్టీ 2,ఎస్సి 7 మంది నియోజకవర్గాలుండగా బీహార్,ఝార్ఖండ్, జమ్మూ&కాశ్మీర్, ఒడిశా,ఉత్తర్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్,హర్యానా,ఢిల్లీ రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ (కర్నాల్‌) దీపేందర్‌ హుడా (రోహ్‌తక్‌), మేనకాగాంధీ (సుల్తాన్‌పూర్‌), మెహబూబా ముఫ్తీ (అనంత్‌నాగ్‌-రాజౌర్‌ వంటి ప్రముఖులు పోటీ చేస్తుండగా చివరి దశ పోలింగ్ జూన్ 1న జరగనుండగా 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Also Read:అధికారుల బదిలితోనే హింస!

- Advertisement -