558 రోజుల తర్వాత కనిష్ఠ స్థాయికి..కరోనా

68
Covid

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 558 రోజుల తర్వాత కనిష్ఠ స్థాయికి కరోనా కేసులు చేరగా గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 6,822 కరోనా కేసులు నమోదుకాగా 220 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,46,48,383కు చేరగా 3,40,79,612 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 95,014 యాక్టివ్ కేసులుండగా 4,73,757 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో ఇప్పటివరకు 128.76కోట్ల మందికి టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది.