పురోహితుడి బహిష్కరణ..అర్చక సంఘం మండిపాటు

47
archaka sangham

సిద్దిపేట జిల్లా బంజేరుపల్లిలో పురోహితుడిని గ్రామం నుంచి బహిష్కరించాలని గ్రామ పెద్దలు చేసిన తీర్మానంపై బ్రాహ్మణ సంఘాలు మండిపడ్డాయి. ఆధునిక యుగంలోనూ కొనసాగుతున్న అటవిక చర్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర దూప,దీప అర్చక సంఘం అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పురోహితుడిని అవమానించిన గ్రామ పెద్దలపై చర్యలు తీసుకోవాలని కోరారు. వారిపై చర్యలు తీసుకునేంత వరకు గ్రామంలో జరిగే శుభ,అశుభ కార్యాలయాలకు ఏ పురోహితుడు వెళ్ళొద్దని రాష్ట్ర బ్రాహ్మణులంతా ఏక గ్రీవ తీర్మానం చేశామని తెలిపారు.