కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సోనియా గాంధీ..

64
sonia

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రజాప్రతినిధులు కరోనా టీకా తీసుకోగా తాజాగా కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ టీకా తీసుకున్నారు. దీంతో సోనియా రెండో టీకా కూడా పూర్తయింది.

మే 16న రాహుల్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాల్సి ఉండగా.. ఒక రోజు ముందు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆయన టీకా తీసుకోలేదు. సోనియా గాంధీ మాత్రం తన రెండో మోతాదులను తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెప్పారు.రాహుల్‌ నిర్ణీత గడువు ముగిసిన తర్వాత టీకా తీసుకుంటారని పేర్కొన్నారు.

కరోనా వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించిన వారు పూర్తిగా కోలుకున్న మూడు నెలల తర్వాత టీకా తీసుకోవాలని ప్రభుత్వం సూచించడంతో ఈ మేరకు కాంగ్రెస్ నేతలు అధికారిక ప్రకటన చేశారు.