ఎమ్మెల్సీ కవితను కలిసిన జెడ్పీటీసీలు..

25

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గురువారం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల‌ జెడ్పీటీసీలు, ఎంపీటీసిలు కలిసి పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు విధులు,కార్యాలయాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జెడ్పీ చైర్ పర్సన్ దఫేదార్ శోభరాజు, జెడ్పీటీసీలు, ఎంపీటీసిలు పాల్గొన్నారు.

గతవారం హైదరాబాద్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీల సమావేశంలో చర్చించిన అంశాలను ఎమ్మెల్సీ కవిత ఈ సమావేశంలో ప్రస్తావించారు. స్థానిక సంస్థల ప్రతినిధులు పలు వినతులను తీసుకురాగా.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు.