రైలులో అగ్ని ప్రమాదం.. 65 మంది మృతి..

460
65 Killed In Pak Train Fire
- Advertisement -

పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటన పాక్‌ లోని లాహోర్ నుంచి కరాచీ వెళ్తున్న తేజ్‌గావ్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 65 మంది సజీవ దహనమయ్యారని, మరో 13 మంది గాయపడ్డారని రైల్వే అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారుల సమాచారం.

65 Killed In Pak Train Fire

కాగా రహీమ్ యార్‌ఖాన్ సమీపంలోని లియాఖత్‌పూర్ వద్ద రైలులోని గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. రైలులో మంటలు చెలరేగడంతో రెండు బోగీలు దగ్ధమయ్యాయని వివరించారు. అయితే ప్ర‌యాణికులు రైలు ఎక్కుతున్న స‌మ‌యంలో గ్యాస్ సిలిండ‌ర్‌ను దాచి ఉంటార‌ని రైల్వే అధికారులు వెల్ల‌డిస్తున్నారు.

pak train fire

అయితే ప్రయానికులు దుస్తుల్లో సిలిండ‌ర్‌ను దాచ‌డం వ‌ల్ల అది త‌మ‌కు తెలియ‌లేదన్నారు. పాకిస్థాన్‌కు చెందిన 1122 రెస్క్యూ బృందాలు మంట‌ల్ని ఆర్పేశాయి. ఆర్మీ ద‌ళాలు, డాక్ట‌ర్లు, పారామెడిక్స్ హుటాహుటిన అక్క‌డ‌కు చేరుకున్నారు. ముల్తాన్ నుంచి ఆర్మీ హెలికాప్ట‌ర్ సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న‌ది సహయక చర్యలు ముమ్మరం చేశారు.

pakistan train accident

ఈ ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాల‌కు ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ సంతాపం తెలిపారు. గాయ‌ప‌డ్డ‌వారికి వైద్యం అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల రైల్వే శాఖ విచార‌ణ‌కు ఆదేశించింది. రెండు గ్యాస్ సిలిండ‌ర్లు పేలాయ‌ని, దానికి తోడు వారి ద‌గ్గ‌ర వంట నూనె ఉండ‌డంతో ప్ర‌మాద తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంద‌ని రైల్వే మంత్రి అభిప్రాయ‌ప‌డ్డారు.

- Advertisement -