644కు చేరిన కరోనా కేసులు..

222
corona
- Advertisement -

తెలంగాణలో కరోనా కేసులు 644కు చేరాయి. మంగళవారం 52 కొత్త కేసులు నమోదుకాగా ఒకరు మృతి చెందారు. హైదరాబాద్‌లోనే ఎక్కువ కేసులు నమోదుకాగా ఆ తర్వాతి స్ధానాల్లో నిజామాబాద్, వికారాబాద్ ఉన్నాయి. తెలంగాణలో యాక్టివ్ పాజిటివ్ కేసులు 516 ఉండగా ఇప్పటివరకు 110 మంది డిశ్చార్జ్ కాగా 18 మంది చనిపోయారు.

మొత్తం 28 జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. పాతబస్తీ తలాబ్‌కట్టా ఆమన్‌నగర్‌–బిలో ఒకే ఇంట్లో 18 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 10న ఈ ప్రాంతానికి చెందిన 68 ఏళ్ల వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందారు. ఆమెకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో కుటుంబసభ్యులను పరీక్షించగా.. 17 మందికి కూడా వైరస్‌ సోకిందని నిర్ధారించారు.

ఇప్పటివరకు వచ్చిన పాజిటివ్‌ కేసుల్లో మర్కజ్‌కు సంబంధించినవే ఎక్కువగా ఉండటం గమనార్హం. 25 జిల్లాల్లో 221 కంటైన్మెంట్ ప్రాంతాలను గుర్తించారు. ఇందులో 3.01 లక్షల ఇళ్లకు వెళ్లి వైద్యాధికారులు సర్వే చేశారు. మొత్తం 12.04 లక్షల మంది వివరాలు నేరుగా సేకరించారు.

- Advertisement -